వీ.హనుమంతరావుకు బీసీ సంక్షేమ సలహాదారు పదవి

1163చూసినవారు
వీ.హనుమంతరావుకు బీసీ సంక్షేమ సలహాదారు పదవి
తెలంగాణ ప్రభుత్వం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ.హనుమంతరావును బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడిగా నియమించడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌లోని ఇనుగుర్తి కాంగ్రెస్ మండల ఓబీసీ అధ్యక్షుడు మర్ద హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో సీనియర్లకు ఎలాంటి అవమానం లేకుండా గౌరవం దక్కుతుందని, ఈ నిర్ణయం సీనియర్ నాయకులకు ఇచ్చే గుర్తింపునకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది నాయకులకు ఇలాంటి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్