మహబుబాబాద్ జిల్లాలోని గంగారం, కొత్తగూడ అటవీ ప్రాంతాలలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం కొత్తగూడ మండలం మహదేవునిగూడెం, గంగారం మండలం జంగాలపల్లి, కామారం, దుబ్బగూడెం అటవీప్రాంతాలలో అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు అమర్చి, పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. పులి ఆనవాళ్లు అటవీ ప్రాంతంలోనే ఉన్నాయని, ప్రజలకు, పశువులకు ఎలాంటి హాని జరగలేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.