మహబూబాబాద్లో సైబర్ నేరగాళ్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కంకరాబోడ్ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, వారిపై వేధింపుల కేసులు ఉన్నాయని బెదిరించి, ఏకంగా రూ. 82,40,000 నగదును కాజేశారు. వాట్సాప్ వీడియో కాల్ చేసి, తాము సీబీఐ అధికారులమని నమ్మబలికిన దుండగులు, అరెస్ట్ వారెంట్ ఉందని భయపెట్టి, విడతల వారీగా డబ్బును బదిలీ చేయించుకున్నారు.