మహబూబాబాద్ జిల్లాలో దట్టంగా పొగమంచు, ప్రయాణికులకు హెచ్చరిక

2చూసినవారు
మహబూబాబాద్ జిల్లాలో పొగమంచు దట్టంగా అలముకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బయ్యారం, గార్ల, కురవి, మరిపెడ, సిరోల్, తొర్రూరు, పెద్దవందర, చిన్న గూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి, డోర్నకల్, గంగారం, ఇనుగుర్తి, కొత్తగూడ మండలాలలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పొగమంచు పెరిగింది. ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్