బయ్యారంలో మూడు రోజులుగా వీడని దట్టమైన పొగమంచు

9చూసినవారు
బయ్యారం మండలంలో గత మూడు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామున కురుస్తున్న భారీ పొగమంచు ధాటికి మండల కేంద్రంతో పాటు అటవీ ప్రాంత గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోతోంది. గత మూడు రోజులుగా ఎండ కనిపించడం లేదు. పొగమంచు వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బయ్యారం-మహబూబాబాద్, బయ్యారం-ఇల్లందు ప్రధాన రహదారులపై వాహనాలు నడపడం కష్టతరంగా మారింది.

ట్యాగ్స్ :