మహబూబాబాద్ జిల్లా లో నేడు సోమవారం మహబూబాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాకు 11: 30 లకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం రోడ్డు మార్గాన కేసముద్రం మండలంలో మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు.