మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మేడారం వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.