మహబూబాబాద్ జిల్లా దర్గతండా గ్రామపంచాయతీ పరిధిలోని లాక్యతండా ఎనిమిదవ వార్డులో నెలల తరబడి మురికి కాలువలు పూడిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ సమస్యను స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, కొత్త పాలకవర్గం కూడా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని కాలువలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.