
బ్యాంక్ ఖాతా ఇస్తే జైలుకే.. ఆర్బీఐ హెచ్చరిక
చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం ఇతరులకు బ్యాంక్ ఖాతాలు ఇవ్వడం తీవ్ర నేరమని, దీనివల్ల జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. డబ్బుల ఆశతో ఖాతాలు ఇస్తే, వాటి ద్వారా జరిగే అక్రమ లావాదేవీలకు ఖాతాదారుడే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలిపింది. మ్యూల్ ఖాతాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బ్యాంక్ వివరాలు, OTPలు, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. సులభంగా వచ్చే డబ్బు కోసం రిస్క్ తీసుకోవడం మంచిది కాదని ఆర్బీఐ పేర్కొంది.




