
చెట్టెక్కిన భారీ కొండచిలువ (వీడియో)
AP: పోలవరం జిల్లా అడ్డతీగల సమీపంలో సోమవారం రాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. రంపచోడవరం-అడ్డతీగల జాతీయ రహదారి పక్కనే ఉన్న టేకు తోటలో వలస కూలీలు దీనిని గుర్తించారు. ఆ కొండచిలువ చెట్టుకు చుట్టుకుంటుండగా, స్థానికులు టార్చ్ లైట్ సహాయంతో మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. అంత పెద్ద పామును చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.




