కురవి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం తీరుకు నిరసన తెలిపారు. ఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మంగళవారం విమర్శించారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, జ్ఞానేశ్ కుమార్ పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు బుడమ వెంకన్న, బుర్ర సమ్మయ్య, తురక రమేష్ తదితరులు పాల్గొన్నారు.