
సుప్రీంకోర్టుకు TVK చీఫ్ విజయ్ ?
తమిళనాడులో నూతన ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఉత్కంఠ నెలకొంది. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తనను ఆహ్వానించలేదనే అంశంపై టీవీకే అధినేత విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. నిన్న 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో రావాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.




