చెరువు తూములో ఇరుక్కుని రైతు దారుణ మృతి

5చూసినవారు
చెరువు తూములో ఇరుక్కుని రైతు దారుణ మృతి
తొర్రూరు మండలం మాటేడు గ్రామ పరిధిలోని బండ మీది తండాకు చెందిన జాటోత్ నరేష్ (40) అనే రైతు చెరువు తూములో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందాడు. ఈరోజు మధ్యాహ్నం పొలానికి నీరు పారుతుందో లేదో చూసేందుకు వెళ్లిన నరేష్, మాటేడు పెద్ద చెరువు బొంతుపల్లి తూము వద్ద రాళ్లను తొలగించేందుకు లోపలికి దిగి, అక్కడే ఇరుక్కుపోయాడు. కొద్దిసేపటికే ఊపిరాడక మరణించినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.