ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య!

2107చూసినవారు
ఇద్దరు చిన్నారులను ఉరి వేసి తండ్రి ఆత్మహత్య!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం రాత్రి కుటుంబ కలహాల కారణంగా తండ్రి తన ఇద్దరు పిల్లలను ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (35) అనే వ్యక్తి మానసిక ఆవేదనతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ముందుగా తన ఇద్దరు కొడుకులకు ఉరివేసి, అనంతరం తాను కూడా ఉరివేసుకున్నట్లు గుర్తించారు. తొర్రూరు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్