ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడ్డ లోపాలు

6చూసినవారు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ఇటీవల కొండగట్టు అంజన్నకు శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కార్మికుడు తలనీలాలు సమర్పించారు. అయితే, ఉపాధి హామీ పనికి వెళ్లి అటెండెన్స్ కోసం ఫోటో దిగుతుండగా, గుండుతో ఉండడం వల్ల అతన్ని యాప్ గుర్తించలేదు. దీంతో పక్కనే ఉన్న మహిళ జుట్టును గుండుపై పరచగానే అటెండెన్స్ నమోదుకు ఫోటోను ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో అంగీకరించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్