మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన గజ్జెల బాగమ్మ మతిస్థిమితం లేకుండా ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9010918086, 9381433104 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.