మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాలతో జిల్లా సివిల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసు సిబ్బందితో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీసు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలా స్పందించాలో ప్రదర్శన నిర్వహించారు.