ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి

9చూసినవారు
ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, గన్నీ సంచులు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్రంలో 50 వేల గన్నీ సంచులు అవసరం ఉండగా, కేవలం 15 వేలు మాత్రమే ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బండ భిక్షంరెడ్డి, పటేల్ రామన్న, సర్పంచి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్