గ్రేటర్ వరంగల్ నుంచి నర్సంపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వరంగల్ కేంద్రం నుంచి ఈ మార్గంలో నిత్యం భారీ ట్రాఫిక్ ఉండటంతో, ప్రజల డిమాండ్ మేరకు రూ. 165 కోట్లతో 40 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులకు శ్రీకారం చుట్టడంతో నర్సంపేట, పరకాల, గీసుకొండ, సెంగం మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.