గూడూరు: మనస్థాపంతో యువతి ఆత్మహత్య

2చూసినవారు
గూడూరు: మనస్థాపంతో యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో కుటుంబ తగాదాలతో మనస్థాపం చెందిన అనూష (19) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వెంగంపేట శివారు పాల్త్య తండాకు చెందిన అనూష నర్సింగ్ చదువుతున్నప్పుడు గణేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి విషయంలో అధిక కట్నం ఇవ్వకపోతే పెళ్లి చేసుకోనని గణేష్ దుర్భాషలాడటంతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్