మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో వైన్స్‌లో దొరకని బీర్లు బెల్ట్ షాపులకు ఎలా చేరుతున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తొర్రూరు ఎక్సైజ్ SI, CI, మహబూబాబాద్ DPEO స్పందించాలని కోరుతున్నారు.