విచారణ కు పిలిస్తే ఇంత రాద్ధాంతం అవసరమా: మంత్రి పొన్నం

7చూసినవారు
మహబూబాబాద్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, కోరం కనకయ్యతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నియంతృత్వానికి, స్వాభిమానానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమని, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల నుండి కాపాడుకోవడానికి నిఘా సంస్థలు టెలిఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగిస్తాయని, అలాంటి వ్యవస్థను తప్పుదారి పట్టించిన వారిని విచారిస్తే రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :