కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు: బీఆర్ఎస్ నేతల నిరసనలు

7చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్(SIT)విచారించడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళనలు మిన్నంటాయి. నిరసన కార్యక్రమంలో భాగంగా శంకర్ నాయక్ తన అనుచరులు, వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్