మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మనీష్ కుమార్(6)అనే బాలుడి పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. బాలుడి మెడపై తీవ్ర గాయాలు కావడంతో మహబూబాబాద్ ఏరియా హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.