మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడలో వాసం వీరస్వామికి చెందిన వ్యవసాయ బావిలో మొసలి సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు, పశువులు బావి సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.