మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ తాడ్వాయి పస్ర ప్రధాన జాతీయ రహదారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరణించిన కమలాకర్ కుటుంబానికి, 1996-1997 పదవ తరగతి చదివిన సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు అండగా నిలిచారు. మంచి మనసుతో వారు ఆ కుటుంబానికి రూ. 55,500 ఆర్థిక సహాయం అందించి, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వేణుగోపాల్ రెడ్డి, రజిని, ప్రభాకర్, సత్యనారాయణ, రమేష్, మొయినుద్దీన్, వెంకన్న, భోజ్య, సతీష్, సుధాకర్ పాల్గొన్నారు.