బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి
కేటీఆర్ సోమవారం (జూన్ 29) మహబూబాబాద్ జిల్లాలో చేపట్టాల్సిన పర్యటన తీవ్ర జ్వరం కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో,
కేటీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రేపటి కార్యక్రమానికి హాజరుకావాల్సిన నాయకులు, కార్యకర్తలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు. పర్యటన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.