మహబూబాబాద్ పట్టణం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ కు వచ్చే చిన్నారులకు, తల్లిదండ్రులకు తాగునీరు మరియు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నిసార్లు పార్కు నిర్వాహకులకు చెప్పిన పట్టించుకోవడంలేదని అంటున్నారు. రోజు ఈ పార్కులో వందల సంఖ్యలో పిల్లలు, తల్లిదండ్రులు వస్తుంటారని మున్సిపాలిటీ అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరుచున్నారు.