పంట వ్యర్థాలు కాలిస్తే చట్టపరమైన చర్యలు: గూడూరు సీఐ

9చూసినవారు
పంట వ్యర్థాలు కాలిస్తే చట్టపరమైన చర్యలు: గూడూరు సీఐ
మహబూబాబాద్ జిల్లా గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల రైతులకు సీఐ వినయ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. వరి, మొక్కజొన్న వంటి పంటల కొయ్యలను కాల్చిన వారికి జరిమానా, జైలు శిక్ష తప్పదని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యంతో పాటు భూసారం, మిత్ర కీటకాలకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఎవరైనా పంట వ్యర్థాలు కాల్చుతుంటే 100, 1077 నంబర్లకు లేదా స్థానిక వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్