
విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో లేను: కమల్ హాసన్
నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తాను విజయ్‌కు సలహా ఇచ్చే స్థితిలో లేనని, సోదరుడిలాంటి విజయ్‌కు సలహా ఇచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదని పేర్కొన్నారు. అనుభవం గొప్ప గురువు అని, అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. 2026లో నిర్వహించనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయనున్న విజయ్‌కు సలహాలిస్తున్నారా? అన్న ప్రశ్నకు కమల్ ఈ విధంగా స్పందించారు. కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.




