మహబూబాబాద్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టేడియంలో కొన్ని లైట్లు మాత్రమే పనిచేస్తుండగా, మిగతావి పనిచేయకపోవడంతో ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం కష్టంగా మారింది. సరైన వెలుతురు లేక ప్రమాదాల ముప్పు ఉందని వాకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లైట్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాల్సి ఉంది.