మహబూబాబాద్: మద్యం మత్తులో బావిలో పడి యువకుడి మృతి

8చూసినవారు
మహబూబాబాద్: మద్యం మత్తులో బావిలో పడి యువకుడి మృతి
బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్న మాదారపు మల్లికార్జున్(26) అనే యువకుడు బహిర్భూమికి వెళ్లి, నీటి కోసం వెతుకుతూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్