మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య విధానాలపై బుధవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో అలోపతి హోమియోపతి మరియు ఆయుర్వేద వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి సహజమైన మందులతో కూడిన ఆయుర్వేద వైద్య విధానాలను అవలంబించి ఆరోగ్యాన్ని రక్షించవచ్చన్నారు.