మహబూబాబాద్: బొలెరో బోల్తా.. మంటలు అంటుకుని దగ్ధం

1903చూసినవారు
మహబూబాబాద్: బొలెరో బోల్తా.. మంటలు అంటుకుని దగ్ధం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గువ్వలబోడు సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సంపేట నుంచి గంగారం వైపు బార్దాన్ (గన్నీ బ్యాగులు) లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడి పూర్తిగా దగ్ధమైంది. రోడ్డు పక్కన మండుతున్న ఎర్రగడ్డి మంటలు వాహనంపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వాహనం వేగంగా వెళ్తుండటంతో మంటలు వ్యాపించాయి. డ్రైవర్ అద్దంలో మంటలను గమనించి వాహనాన్ని పక్కకు తిప్పే ప్రయత్నం చేయగా, అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుధాకర్ తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్