మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గత రెండు మూడు రోజుల నుండి మామూలు జలుబు, జ్వరంతో బాధపడుతున్న సిద్ధార్థని చికిత్స నిమిత్తం తొర్రూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ కు బుధవారం తల్లి నాగరాణి తీసుకొని వచ్చింది. డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.