మహబూబాబాద్ పట్టణంలో 'ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్' పేరుతో ప్రజలను మోసం చేసిన అజ్మీర మంగీలాల్, అతని భార్య సావిత్రిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి సుమారు 80 లక్షల రూపాయలు వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి చిట్టీల నిర్వాహకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.