మహబూబాబాద్: అనుమానాస్పదంగా వృద్ధుడి మృతి

0చూసినవారు
మహబూబాబాద్: అనుమానాస్పదంగా వృద్ధుడి మృతి
కేసముద్రం మండలం కల్వల గ్రామంలో 74 ఏళ్ల గంట ప్రభాకర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. రాత్రి వరకు బాగానే ఉన్న ఆయన తెల్లవారుజామున ఇంట్లో విగత జీవిగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ రెడ్డి కేసముద్రం మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డికి సోదరుడు.

సంబంధిత పోస్ట్