మహబూబాబాద్: రైళ్లలో బాల కార్మికుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

20చూసినవారు
మహబూబాబాద్: రైళ్లలో బాల కార్మికుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఆర్పీఎఫ్, వరంగల్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో, మహబూబాబాద్ ఆర్పీఎఫ్ ఎస్ఐ యస్.కె. సుభాని ఆధ్వర్యంలో సిబ్బంది రైళ్లలో, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో బాల కార్మికులు, బాలల అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రైళ్లలో నిషేధిత వస్తువుల రవాణా చేయరాదని, రైల్వే నియమాలను ఉల్లంఘించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని, రైల్వే అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. గతంలో బాల కార్మికుల అక్రమ రవాణా ముఠాను పట్టుకొని, రక్షించబడిన బాలలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్