మహబూబాబాద్‌: పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీ

14చూసినవారు
మహబూబాబాద్‌: పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీ
మహబూబాబాద్‌ జిల్లాలో షాకింగ్ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. బయ్యారం (M)లో పలువురు పంచాయతీ కార్యదర్శుల పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయి. నామలపాడు, ఇర్సులాపురం, కొత్తగూడెం, బాల్యాతండా గ్రామపంచాయతీ కార్యదర్శుల డిజిటల్ పాస్‌వర్డ్‌లను గుర్తు తెలియని వ్యక్తులు చేజిక్కించుకున్నారు. వాటి సహాయంతో 290 మంది జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్