మహబూబాబాద్: ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నిరసన ర్యాలీ

77చూసినవారు
మహబూబాబాద్: ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని నిరసన ర్యాలీ
మహబూబాబాద్ పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై దాడులు చేయడం సరైన చర్య కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను పిలిచి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆపరేషన్ కగార్ ఆపేవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you