మహబూబాబాద్ జిల్లా పరిధిలో షీ టీమ్ బృందాలు అధికారుల పర్యవేక్షణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పని చేస్తున్నాయని ఐపీఎస్ సుధీర్ రామ్నాథ్ కెకన్ గురువారం తెలిపారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థినులు, మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్ లు ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్టు వేస్తునాయని అన్నారు. షీ టీమ్ పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిలకు చెక్ పెడుతున్నారన్నారు.