మహబూబాబాద్ పట్టణ పరిధిలోని పలు చౌరస్తాలలో సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించిన సీఐ గట్ల మహేందర్ రెడ్డి, వాహనదారులు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు నియమ, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతీ వాహనదారుడు వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, డ్రంకెన్ డ్రైవ్ లపై నిత్యం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.