ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, గత నెల 28న అలబామా హిల్స్ వద్ద కారు లోయలో పడి మృత్యువాత పడిన మేఘన రాణి (24), భావన (24)ల పార్థివ దేహాలు 14 రోజుల నిరీక్షణ అనంతరం శనివారం మహబూబాబాద్ జిల్లా గార్లలోని వారి స్వస్థలాలకు చేరాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇద్దరి స్నేహితురాళ్లను ముల్కనూర్ లోని భావన వ్యవసాయ క్షేత్రంలో ఒకే చోట ఖననం చేశారు.