అన్నం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

2చూసినవారు
అన్నం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం పిల్లి గుండ్ల తండాలో దుర్గమ్మ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న బానోత్ బిచ్చ (54) అనే వ్యక్తికి ఆహారం గొంతులో ఇరుక్కుపోయి మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం మృతుని కుమారుడు బానోత్ నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్