మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎంచగూడెం గ్రామంలో గురువారం శ్రీ కొమ్మాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంచగూడెం, పరిసర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.