ములుగు జిల్లా సివిల్ సప్లై శాఖ మేనేజర్ గా సభావట్ కృష్ణవేణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల మేనేజర్ గా సేవలందించిన ఆమె, యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ జరుగుతుందని, రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతోందని ఆమె వెల్లడించారు.