ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ లో శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల మహోత్సవాలు ఆగస్టు 19వ తేదీ (బుధవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీన ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణతో మహోత్సవాలు ముగియనున్నాయి. ఈ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. 13-08-2026న సుద్దాశాలు, 19-08-2026న బోనాల మహోత్సవాల ప్రారంభం, 11-09-2026న ప్రత్యేక పూజలతో మహోత్సవాల ముగింపు జరుగుతాయి. శ్రీ ముత్యాలమ్మ తల్లి పూజారులు బొడ్డుపల్లి కుమ్మరి వంశీయులు.