మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీలో పులి అలజడి మొదలైంది. గురువారం గంగారం, కొత్తగూడ మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు లభించాయి. రాంపూర్, ఓటాయి, కర్ణగండి గ్రామస్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. పులులు తోడు కోసం ఈ సమయంలో అటవీ ప్రాంతాలకు రావడం సహజమేనని ఫారెస్ట్ అధికారులు భరోసా ఇస్తున్నారు. రైతులు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.