చిన్నముప్పారంలో నిరుపయోగంగా పెట్రోల్ బంక్

14చూసినవారు
చిన్నముప్పారంలో నిరుపయోగంగా పెట్రోల్ బంక్
ఇనుగుర్తి మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంక్ దాదాపు ఆరు నెలలుగా పెట్రోల్, డీజిల్ సరఫరా లేక నిరుపయోగంగా మారింది. దీంతో గ్రామ ప్రజలు, వాహనదారులు ఇంధనం కోసం కేసముద్రం, ఇనుగుర్తి, ఆలేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సమయం, ప్రయాణ ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, బంక్ నిర్వాహకులు స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్