హత్య కేసును ఛేదించిన పోలీసులు

3చూసినవారు
హత్య కేసును ఛేదించిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా సింగారం మాజీ ఉపసర్పంచ్ యాకయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో యాకయ్య భార్యతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఏడుగురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.